: జాతీయ స్థాయి రాతి దూలం లాగుడు పోటీల్లో 'కింగ్ ఆఫ్ షో'!
జాతీయ స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగగా 'కింగ్ ఆఫ్ షో'గా తాటిచెర్ల గ్రామానికి చెందిన మండవ రవీంద్ర గిత్త నిలిచింది. అందాల పోటీల్లో ప్రథమ బహుమతి రూ. 15 వేలతో పాటు, మిగతా విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచి 'కింగ్ ఆఫ్ షో' గుర్తింపు పొంది మరో రూ.30వేల నగదు బహుమతి దక్కించుకుంది. సబ్ జూనియర్ విభాగంలో పోటీలకు సినీనటి సంజన హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజేతలకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ బహుమతులు అందజేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు నేతలు హాజరుకాగా, జేసీ సోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.