: బస్సు యాత్రే కాదు, శవ యాత్ర కూడా చేసుకో: జగన్ పై పరిటాల సునీత విసుర్లు


వైకాపా అధినేత వై.ఎస్ జగన్‌ ను టార్గెట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో జరిగిన రేషన్‌ డీలర్ల సమావేశంలో పాల్గొన్న ఆమె, జగన్‌ బస్సు యాత్రతో పాటు శవయాత్ర కూడా చేసుకోవచ్చని, అయినా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఆగబోదని స్పష్టం చేశారు. జగన్ స్వార్థ రాజకీయాలు చేస్తూ, తన అనుచరులతో కూడా చేయిస్తున్నారని ఆమె విమర్శించారు. పట్టిసీమ పనులను ఏడాదిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రేషన్ విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ-పాస్‌ విధానాన్ని నెల రోజుల్లోగా పారదర్శకంగా తయారు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News