: డిగ్రీ పరీక్షలు రాస్తున్న యువతి కిడ్నాప్... మెదక్ జిల్లాలో కలకలం!


డిగ్రీ పరీక్ష రాస్తున్న విద్యార్థినిని కొందరు దుండగులు "మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు" అని చెప్పి కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కంగ్టి మండలం తురకవాడకు చెందిన యువతి డిగ్రీ పరీక్షలు రాసేందుకు నేటి ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం వరకు కుమార్తె ఇంటికి రాకపోవడంతో, ఆందోళనతో కాలేజీ వద్ద విచారించగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News