: ప్రధాని పక్కన ఉండగానే రూ. 25 కోట్లు ఇవ్వాలని బెదిరింపు!


గౌతమ్ థాపర్ నేతృత్వంలోని రూ. 24 వేల కోట్ల విలువైన అవంతా గ్రూప్ లో సీనియర్ డైరెక్టర్ అనిల్ భార్గవను రూ. 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గతవారంలో ప్రధాని యూరప్, కెనడా పర్యటన సందర్భంగా, ఆయన వెంట వెళ్ళిన బృందంలో అనిల్ కూడా ఉన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా పర్యటనలో ఉన్నప్పుడు తనకు ఫోన్ కాల్స్, మెసేజ్ లు వచ్చాయని, రూ. 25 కోట్లు ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని అనిల్ తెలుపగా, ఆయన తరపున బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. సంస్థ బాలార్ పూర్ యూనిట్ లో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అధికారిగా పనిచేస్తున్న జస్పాల్ సింగ్ నిందితుడని తేల్చి అతడిని అరెస్ట్ చేశారు. జస్పాల్ కింద పనిచేసే ఉద్యోగి దీపక్ కిషోర్ ముంబైకి వెళ్లి ఈనెల 11, 13 తేదీల్లో భార్గవకు ఫోన్ కాల్స్ చేశాడని పోలీసులు తెలిపారు. దీపక్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News