: పట్టిసీమకు పునాదితో టీడీపీ సమాధి: వైకాపా


చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుకు వేసిన పునాది తెలుగుదేశం పార్టీకి సమాధిగా మారనుందని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తమ నేత వై.ఎస్. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు, అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. జగన్ పై నిత్యమూ విమర్శలు గుప్పిస్తూ, బురద జల్లడాన్ని మానుకోవాలని హితవు పలికారు. రూ. 300 కోట్ల ముడుపుల కోసం హడావుడిగా తెలుగుదేశం పట్టిసీమను మొదలుపెట్టిందని, అదే చివరికి ఆ పార్టీ నాశనానికి కారణం కానుందని అంబటి జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News