: బీజేపీలో చేరిన విశాఖ మాజీ మేయర్


విశాఖపట్నం మాజీ మేయర్ పులుసు జనార్దన్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ నేత, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, మరో మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో విజయవాడలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చాలాకాలం నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆయన కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జనార్దన్ అన్నారు. మోదీ ఆశయసాధన కోసమే బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News