: రాజేంద్రప్రసాద్ కు జయసుధ అభినందనలు... గెలిచాక కూడా గౌరవంగా వ్యవహరించడంలేదని వ్యాఖ్య
'మా' అధ్యక్షుడిగా గెలిచిన నటుడు రాజేంద్రప్రసాద్ కు నటి జయసుధ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో రాజేంద్రుడిపై 85 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె నిన్న(శుక్రవారం) మీడియా ముందుకు రాలేదు. అయితే ఈరోజు మీడియాతో జయసుధ మాట్లాడారు. రాజేంద్రప్రసాద్ లా తాను ప్రచారం చేయలేకపోయినప్పటికీ తనకు 150 ఓట్లు వచ్చాయన్నారు. అయితే గెలిచాక కూడా రాజేంద్రుడు డిగ్నిటీగా వ్యవహరించకుండా... తన గురించి మాట్లాడేటప్పుడు కామెడీగా మాట్లాడుతున్నారని అన్నారు. దాంతో ఆయన తన గౌరవాన్ని కోల్పోయారని విమర్శించారు. ఎవరు గెలిచినా 'మా' అభ్యున్నతికి తోడ్పడాలన్నదే తన కోరిక అని జయ తెలిపారు.