: శేషాచలం ఎన్ కౌంటర్ పై 10 రోజుల్లో ఎస్టీ కమిషన్ కు నివేదిక: జాతీయ ఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడు
శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ పూర్తయిందని, పది రోజుల్లో ఎస్టీ కమిషన్ కు నివేదిక అందజేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ ఉపాధ్యక్షుడు రవి ఠాకూర్ తెలిపారు. ఎన్ కౌంటర్ పై విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం సరిగానే వ్యవహరించిందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం నాలుగు హెక్టార్ల భూమి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు. తమిళనాడు, ఏపీల్లో ఎర్రచందనం కూలీలు ఉన్నారని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు.