: పవర్ కట్ ఓ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది
పవర్ కట్ ఓ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పవర్ కట్ సర్వసాధారణం. అదే ప్రాంతంలోని ఖాదిర్ కు సూరత్ కు చెందిన బబ్లీ (32)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లల్ని, భార్యను బాగా చూసుకునే ఖాదిర్ కి ఓ అలవాటుంది. రాత్రి భోజనాన్ని విద్యుత్ వెలుగులో చూస్తూ తినడం. దీంతో క్యాండిల్ వెలుగులో భోజనం చేసి పడుకుందామంటే ససేమిరా అనేవాడట. కరెంటు వచ్చేవరకు మేలుకుని ఉండి వడ్డిస్తే కానీ భోజనం చేసేవాడు కాదట. అలా పెట్టకపోతే భార్యకు బడితపూజ చేసేవాడట. అతని ఈ వైఖరిని భరించలేని బబ్లీ అలవాటు మార్చుకోమని సూచించినా, అతను మారకపోవడంతో అతడితో విడాకులు కోరుతూ పుట్టింటికి వెళ్లిపోయింది.