: జమ్మూకాశ్మీర్లో ముదిరిన మస్రత్ ఆలం వివాదం


జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాది మస్రత్ ఆలం వివాదం ముదురుతోంది. ఆలం అరెస్టుకు నిరసనగా జమ్మూకాశ్మీర్ బంద్ కు హురియత్ నేత గిలానీ ఇచ్చిన పిలుపుకు యువకులు స్పందిస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చిన యువకులు రాళ్ల దాడులకు పాల్పడుతున్నారు. రోడ్లపైనున్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతో జరిపిన భాష్పవాయు గోళాల ధాటికి ఒకరు మృతి చెందారు. భద్రతా బలగాలు పటిష్ఠంగా పహారా కాస్తున్నప్పటికీ గుంపులుగా వస్తున్న యువత షాపులను అడ్డం చేసుకుని రాళ్లు రువ్వుతున్నారు. ఇళ్లపైకి రాళ్లు చేర్చుకుని భద్రతా బలగాలపైకి రువ్వుతున్నారు.

  • Loading...

More Telugu News