: సముద్రంలో మునిగిపోయినా ఠీవి కోల్పోలేదు


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రంలో మునిగిపోయిన ఆమెరికా విమాన వాహక నౌకను కాలిఫోర్నియాలోని ఫాలెన్ ద్వీపం సమీపంలో గుర్తించారు. 64 ఏళ్ల క్రితం మునిగిపోయిన ఈ యూఎస్ఎస్ ఇండిపెండెన్స్ విమానవాహకనౌక, అణుబాంబు పరీక్షల కోసం అమెరికా నిర్మించిన 90 నౌకల్లో ఒకటి. సముద్రంలోని 2,600 అడుగుల (800 మీటర్ల)లోతున ఉన్న ఈ నౌక సముద్రజలాలపై ఎంత ఠీవిగా ప్రయాణించేదో, అలాగే నీటి అడుగున కూడా ఉందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) పరిశోధకులు జేమ్స్ డెల్గాడో తెలిపారు. ఏమాత్రం చెక్కుచెదరని ఈ నౌక 1943 నవంబర్ నుంచి 1945 ఆగస్టు వరకు అమెరికా నావికాదళంలో సేవలందించింది.

  • Loading...

More Telugu News