: అద్దె ఇంట్లోకి చంద్రబాబు


టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అద్దె ఇంట్లోకి మారారు. హైదరాబాదు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉన్న పాత ఇంటిని కొత్త హంగులతో నిర్మించ తలపెట్టిన ఏపీ సీఎం, అద్దె ఇంట్లోకి మారారు. కుటుంబ, పార్టీ వ్యక్తిగత అవసరాలు తీర్చే గృహం కోసం చేసిన అన్వేషణ ఫలించడంతో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 24లో గల ఓ ఇంటికి మారారు. రోడ్ నెంబర్ 65లోని తన ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయన కుటుంబం అద్దె ఇంట్లో నివసించనుంది. బాబు కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తింటి నిర్మాణం జరగనుంది.

  • Loading...

More Telugu News