: పాతబస్తీలో బ్రోకర్ల ఆగడాలు...ఉద్యోగం పేరిట వ్యభిచారం


పాతబస్తీలో నెలకొన్న పేదరికాన్ని కాసులుగా మార్చుకుంటున్న బ్రోకర్ల దారుణాలు ఒకటి తరువాత ఒకటిగా వెలుగు చూస్తున్నాయి. పాతబస్తీలో పేద ముస్లిం కుటుంబాలను లక్ష్యం చేసుకున్న బ్రోకర్లు వారికి కల్లబొల్లి కబుర్లు చెబుతూ యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దుబాయ్ షేక్ లకు తాత్కాలిక పెళ్లిళ్లకు యువతులను సప్లై చేయడమే కాకుండా, మంచి వేతనంతో ఉద్యోగాలంటూ వంచిస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని పాతబస్తీ రెయిన్ బజార్ కు చెందిన తమీమ్ ఫాతిమా అనే మహిళను మంచి ఉద్యోగం, మంచి వేతనం అంటూ వీలైనన్ని అబద్ధాలు చెప్పి దుబాయ్ కి పంపించాడు స్థానిక బ్రోకర్ అబిద్ సయ్యద్. అతని మాటలు నిజమని నమ్మిన ఆమె దుబాయ్ వెళ్లాక నరకం చూసింది. ఇంట్లో పని అని వెళ్లిన తమీమ్ ఫాతిమాను వ్యభిచారం రొంపిలోకి దింపే ప్రయత్నం జరిగిందట. దీనికి నిరాకరించిన ఆమెకు చిత్రహింసలు చూపుతున్నారట. ఆమె ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో విషయం తెలుసుకుని పాతబస్తీ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. వుమెన్ ట్రాఫికింగ్, మోసం, తప్పుదోవ పట్టించడం వంటి సెక్షన్లపై బ్రోకర్ అబిద్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఆమెను వీలైనంత త్వరగా హైదరాబాదు రప్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News