: ఆసుపత్రి బిల్లు చెల్లించలేక...కొడుకును అమ్ముకున్నారు


ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కాంట్రాక్టు కార్మికుడు ఆసుపత్రి బిల్లు చెల్లించలేక కన్న కొడుకును అమ్ముకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌ నగర్ లోని సర్‌ సిల్క్ కాలనీకి చెందిన కాంట్రాక్టు కార్మికుడు ఎస్పీఎంలో పని చేసేవాడు. మిల్లు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నాలుగు రోజుల క్రితం అతని భార్య స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి బిల్లు 13 వేలు వచ్చింది. దీనిని కట్టలేక అతను బిడ్డను హైదరాబాదుకు చెందిన ఒక వ్యాపారికి అమ్మేశాడు. సదరు వ్యాపారి ఆసుపత్రి బిల్లుతో పాటు, వారి కష్టాలను గట్టెక్కించేందుకు మరికొంత నగదు కూడా అందజేసినట్టు తెలుస్తోంది. కొడుకును అమ్ముకునేందుకు కాగజ్‌ నగర్ మున్సిపాలిటీ ఉద్యోగి మధ్యవర్తిత్వం నెరిపినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News