: 'ఫేస్ బుక్' సినిమా హీరోపై కేసు


'ఫేస్ బుక్' సినిమా హీరో ఉదయ్ పై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గతంలో ఉదయ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడంటూ ప్రవీణ్ అనే వ్యక్తి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిని మనసులో పెట్టుకున్న ఉదయ్ అలియాస్ బాబీ, నిన్న పబ్ లో ప్రవీణ్ కంటబడడంతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ను ఉదయ్ గాయపరిచాడు. దీంతో ప్రవీణ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 506, 509ఏ పై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News