: తేలే వరకు ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి జోలికెళ్లొద్దు: హైకోర్టు


ప్రపంచ స్థాయిలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదులా హైకోర్టు అడ్డుపడింది. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రస్తుతమున్న భవనాన్ని వారసత్వ సంపద (హెరిటేజ్) జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయం తేల్చేంత వరకు దాని జోలికెళ్లొద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రుల ప్రాంగణంలో చారిత్రక భవనం ఉందని, అందువల్ల కొత్త సచివాలయ నిర్మాణం కుదరదని, ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, దీనిపై వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేసి, ఆరు వారాల్లో నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని, దీన్ని పరిష్కరిస్తున్నట్లు జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News