: జమ్మూ కాశ్మీర్ లో నేడు బంద్...పేట్రేగిపోతున్న వేర్పాటు వాదులు
జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాదులు పేట్రేగిపోతున్నారు. మస్రత్ ఆలంను విడుదల చేయడంతో రాజుకున్న వివాదం కేంద్రానికి కునుకులేకుండా చేస్తోంది. బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీడీపీ, తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు, అధికారంలోకి రాగానే మస్రత్ ఆలంను విడుదల చేసి, ఇప్పుడు దాని పర్యవసానాలు అనుభవిస్తోంది. ఇప్పుడు మళ్లీ మస్రత్ ఆలంను అరెస్టు చేయడంతో వేర్పాటు వాదులు ఏకమయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో జమ్మూకాశ్మీర్లో కనిపించిన దృశ్యాలు, మళ్లీ రోడ్లపై చేస్తున్నాయి. మస్రత్ ఆలంను అరెస్టు చేసినందుకు నిరసనగా, వేర్పాటు వాదులు నేడు జమ్మూకాశ్మీర్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. బంద్ ను విజయవంతం చేసేందుకు వేర్పాటు వాదులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.