: పొలార్డ్ వీరవిహారం...ముంబై ఇండియన్స్ స్కోర్ 183


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడిన ముంబై ఇండియన్స్ జట్టు పతనం నుంచి విశేషంగా రాణించి 184 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 12 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ (50), హర్భజన్ సింగ్ (24) అండతో పుంజుకుని, పొలార్డ్ (64) వీరవిహారంతో, రాయుడు (29) సహకారం తోడు కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు 183 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ముంబై బ్యాట్స్ మన్ కు కళ్లెం వేసినప్పటికీ పొలార్డ్, రోహిత్ సమర్థవంతంగా ఎదుర్కోవడం విశేషం. చెన్నై బౌలర్లలో ఆశిశ్ నెహ్రా మూడు వికెట్లు తీయగా, బ్రావోకు రెండు వికెట్లు లభించాయి. పాండే, ఎం.ఎం.శర్మ చెరో వికెట్ తీసి వారికి చక్కని సహకారమందించారు.

  • Loading...

More Telugu News