: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో మామిడి, జీడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో పిడుగుపాటుకు గురై నలుగురు అసువులు బాసారు. నేటి సాయంత్రం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో రాజమండ్రి పట్టణంలో చీకట్లు అలముకున్నాయి.