: ధోనీ సేనను రోహిత్ అడ్డుకోగలడా?
ధోనీ సేనను రోహిత్ శర్మ టీం అడ్డుకుంటుందా? అంటే అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టులో టాప్ ప్లేయర్స్ ఉన్నా, దిగ్గజాల మార్గదర్శకం, పర్యవేక్షణ ఉన్నప్పటికీ దారుణంగా విఫలమవుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై విమర్శలకు కేంద్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. వరుసగా రెండు విజయాలతో టాప్ 2 గా కొనసాగుతున్న చెన్నైకి అడ్డుకట్టవేయాలంటే ముంబై బౌలర్లు విశేషంగా రాణించాలి. ఇంతవరకు ముంబై బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కాగా, మూడు మ్యాచుల్లో రాణించిన కోరే ఆండర్సన్ ఫాంలో ఉండగా, పొలార్డ్, రోహిత్, హర్బజన్ ఒక్కో మ్యాచ్ లో రాణించి సత్తా చాటారు. వీరంతా కలసికట్టుగా ఆడితే, ధోనీ సేనకు ఇక్కట్లే. కాగా, అద్భుతమైన ఆటతీరుతో ధోనీ సేన దూసుకుపోతోంది. ఆటగాళ్ల ప్రదర్శనకు ధోనీ ముగింపు, కెప్టెన్సీ అదనపుబలం కానున్నాయి. ఈ మ్యాచ్ లో చెన్నై ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.