: చంద్రబాబు సమైక్యాంధ్ర సీఎంలా వ్యవహరిస్తున్నాడు: మైసూరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర సీఎంలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఇక్కడా నీళ్లిస్తానంటాడు, అక్కడా నీళ్లిస్తానంటాడు...అదెలా సాధ్యమో మాత్రం చెప్పడని అన్నారు. కేవలం ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమీ లేదు సరికదా, గాలేరు-నగరి, పోలవరం ప్రాజెక్టులను ఇబ్బందుల్లోకి నెడుతుందోమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాబు ప్రాజెక్టులు నిరర్థక ఆస్తులుగా మారుతాయేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.