: పశువులక్కూడా ఆధార్ తరహా గుర్తింపు కార్డులు!


ఆధార్ తరహా గుర్తింపుకార్డులు పాడిపశువులకు కూడా ఇవ్వాలని మహారాష్ట్ర రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై ఆ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి ఏకనాథ్ గాడ్సే మాట్లాడుతూ, పాడిపశువులకు గుర్తింపు కార్డులపై అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే కచ్చితంగా పరిశీలిస్తామని అన్నారు. మహారాష్ట్రలో మొదటి నుంచీ పాడిపరిశ్రమకు ప్రాధాన్యత ఎక్కువని, అందుకే రైతులు పాడిపశువులకు కూడా గుర్తింపు కార్డులు అడుగుతున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పద్ధతులు అమల్లో ఉన్నాయని, తాము కూడా వాటిని అమలు చేయడానికి కృషిచేస్తామని ఆయన చెప్పారు. అహ్మద్ నగర్ లోని శ్రీరాంపూర్ లో 3 వేల ఆవులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని ప్రభాత్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ నిర్మల్ తెలిపారు.

  • Loading...

More Telugu News