: శ్రీనగర్ లో వేర్పాటువాదుల ఆందోళన... పోలీసుల లాఠీఛార్జి
వేర్పాటువాద నేత మసరత్ ఆలంను పోలీసులు అరెస్టు చేయడంతో శ్రీనగర్ లో వేర్పాటువాదులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వేర్పాటువాదులు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులకు, వేర్పాటువాదులకు మధ్య ఘర్షణ జరిగింది. వారిని అరికట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి, చెదరగొట్టేందుకు బాష్ప వాయువు ప్రయోగించారు. ఈరోజు అదుపులోకి తీసుకున్న మసరత్ ను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మరో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇటీవల ఎన్ కౌంటర్ ఓ యువకుడు చనిపోవడంతో దానికి వ్యతిరేకంగా ట్రాల్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అందువల్లే ప్రస్తుతం శ్రీనగర్ లో ఆందోళనలు జరుగుతున్నాయి.