: ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్ లో ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ సందడి


సెకండ్ ఇన్సింగ్స్ లో సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ త్వరలో 68వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై నడవబోతోంది. ఈసారి మరో నటి సోనమ్ కపూర్ తో కలిసి ఐష్ అక్కడ సందడి చేయనుంది. ఈ విషయాన్ని కాస్మొటిక్ బ్రాండ్ లోరియల్ తన ట్విట్టర్ ఖాతాలో ధ్రువీకరించింది. "సోనమ్ కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు కేన్స్ 2015 రెడ్ కార్పెట్ పై కలసి నడవబోతున్నారు" అని ట్వీట్ చేసింది. లోరియల్ బ్రాండ్ కు ఐశ్వర్య, సోనమ్ లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మే 13 నుంచి 24 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. గతంలో పలుమార్లు వారిద్దరూ కేన్స్ ఫెస్టివవల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News