: రాజేంద్రప్రసాద్ విజయంపై రోజా స్పందన


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్ ఎన్నికవడంపై సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ విజయంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు గుణపాఠమని రోజా వ్యాఖ్యానించారు. పేదకళాకారుడు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. డబ్బున్న వారు మాట చెలామణి అవుతుందని గర్వించిన వారికి తగిన శాస్తి జరిగిందని ఆమె చురకంటించారు. గతంలో కొందరు గౌరవం కోసం 'మా' అధ్యక్ష పదవిని వాడుకున్నారని, వారు కళాకారులకు ఏమీ చేయలేదని రోజా విమర్శించారు. 'మా' అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికకావడం సంతోషంగా ఉందని, ఆయన కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News