: వైభవంగా టీఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాపిపాసి టి. సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో టీఎస్సార్ జాతీయ అవార్డుల కార్యక్రమం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శిల్పకళావేదిక వేదికగా నిలిచింది. కేంద్రమంత్రి చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రధానాకర్షణగా నిలిచారు.
కాగా,కైకాల సత్యనారాయణకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ చేతుల మీదుగా సత్యనారాయణ అవార్డు అందుకున్నారు. 'ఓనమాలు' సినిమాకు గాను రచయిత 'ఖదీర్ బాబు'కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. అర్జున్ కు ప్రత్యేక అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ క్యారెక్టర్ నటిగా సన పురస్కారాన్ని అందుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు బాలకృష్ణ చేతుల మీదుగా టీఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు రామానాయుడు, నాగార్జున, తమన్నా, తనికెళ్ళ భరణి, శ్రీను వైట్ల, తమన్, బాలీవుడ్ దంపతులు శ్రీదేవి, బోనీకపూర్, రాణీ ముఖర్జీ, తమిళ నటుడు అర్జున్, స్నేహ, ఆమె భర్త ప్రసన్న హాజరయ్యారు.