: ఎర్రచందనం కొనుగోలుదారుల్లో రాందేవ్ బాబాదే అగ్రస్థానమట!


శేషాచలం అడవులు ఎర్రచందనం వృక్షాలకు నిలయం. అదే సమయంలో ఎర్రచందనం దుంగలను భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న వారిలో ప్రముఖ యోగా గురువు, హర్యానా బ్రాండ్ అంబాసిడర్ రాందేవ్ బాబా అగ్రణ్యుడు. అయినా యోగా గురువు ఎర్రచందనంతో ఏం చేస్తున్నారనేగా మీ అనుమానం. ఆయన ఆధ్వర్యంలోని పతంజలి యోగా పీఠం ఆయుర్వేద మందుల తయారీలో ఎర్రచందనాన్ని వినియోగిస్తోందట. శేషాచలం అడవుల నుంచి అక్రమ మార్గాల్లో తరలిపోతున్న ఎర్రచందనం నేరుగా చైనా తరలిపోతుంటే, రాందేవ్ బాబా మాత్రం చట్టబద్ధంగానే ఎర్రచందనం దుంగలను కొంటున్నారు. ఇటీవల ఏపీ సర్కారు ఎర్రచందనం దుంగల విక్రయం కోసం జరిపిన వేలంలో పతంజలి యోగా పీఠం పాల్గొంది. ఏకమొత్తంలో 706 టన్నుల ఎర్రచందనం దుంగలను దక్కించుకున్న యోగా పీఠం, అందుకోసం ఏకంగా రూ.207 కోట్లు వెచ్చించింది. ఆయుర్వేద మందుల తయారీలో ఎర్రచందనాన్ని వినియోగిస్తున్నామంటున్న ఆ సంస్థ ప్రతినిధులు, అందుకోసమే పెద్ద మొత్తంలో ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేస్తున్నామని వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News