: రాజేంద్రప్రసాద్ నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి... అలాగని జయసుధకు వ్యతిరేకం కాదు: నాగబాబు


'మా' అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించడంపై మరో నటుడు నాగబాబు మీడియాతో స్పందించారు. ఈ పదవికి రాజేంద్రుడి ఎన్నిక ఏకగ్రీవంగా చేయాలనుకున్నామని చెప్పారు. అలాగని తాము జయసుధకు వ్యతిరేకం కాదన్నారు. రాజేంద్రప్రసాద్ నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టే ఆయన అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ చివరికి ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్టు వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా మొదట్లో జరిగిన కొన్ని పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని, అసలు కోర్టు వరకు వెళ్లాలన్న ఆలోచన రాలేదని నాగబాబు వివరించారు. అయితే ఇవన్నీ నటుడు ఓ.కల్యాణ్ కు నచ్చలేనందువల్లే కోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు.

  • Loading...

More Telugu News