: చిరంజీవి ఆశీస్సులతోనే విజయం: కాదంబరి కిరణ్
మెగాస్టార్ చిరంజీవి తమ వెన్నంటి ఉన్నారని, నాగబాబు తమ గుండెకాయని 'మా' ఎన్నికల్లో సభ్యుడిగా గెలిచిన కాదంబరి కిరణ్ వ్యాఖ్యానించారు. వారి సహాయ సహకారాలతోనే తాము విజయం సాధించామని వివరించారు. మోహన్ బాబు, దాసరి నారాయణరావు, బాలకృష్ణ వంటి వారి మద్దతుతో తాము ధర్మయుద్ధం చేశామని ఆయన అన్నారు. మా ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ మీడియాతో మాట్లాడింది. కాస్తంత ఆవేశంగా మాట్లాడిన కిరణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. సినీనటుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.