: చిన్నారులపై గ్యాస్ దాడిని చూసి కన్నీరు కార్చిన ఐరాస అధికారులు
క్లోరిన్ గ్యాస్ దాడి జరిగిన చిన్నారులను తాము కాపాడలేకపోయామని చెబుతూ, వారి స్థితిని, తాము చేసిన చికిత్సలను వీడియో తీసిన డాక్టర్లు దానిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధికారులకు చూపగా, పట్టరాని వేదనతో వారు కన్నీరు కార్చారు. గత నెలలో సిరియాలోని సర్మిన్ గ్రామంలో క్లోరిన్ గ్యాస్ దాడి జరుగగా, 1, 2, 3 సంవత్సరాల వయసున్న ముగ్గురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు, నాయనమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఇడ్లిబ్ ప్రావిన్స్ లోని ఆసుపత్రికి తీసుకురాగా, డాక్టర్ మొహమ్మద్ తెనారీ ఆధ్వర్యంలోని డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ వారిని కాపాడలేక పోయారు. బాధతో తమ కన్నీరు సైతం ఇంకిపోయిందని ఐరాసలో అమెరికా ప్రతినిధి సమంతా పోవర్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన అత్యంత అసాధారణమని, హృదయాలను ద్రవింపజేస్తోందని ఆమె అన్నారు.