: జయసుధ ఓటమి మురళీమోహన్ దే: నటుడు విజయ్ చందర్
'మా' అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ గెలుపు దాదాపు ఖాయమైంది. దాంతో ఆయన మద్దతుదారులు ఫిల్మ్ చాంబర్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో నటుడు విజయ్ చందర్ మీడియాతో మాట్లాడుతూ, జయసుధ ఓటమి మురళీమోహన్ దేనన్నారు. రాజేంద్రప్రసాద్ కంటే జయసుధ 80 ఓట్లకు తక్కువలో ఉన్నారని చెప్పారు. ఈ గెలుపుతోనైనా 'మా'లో మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు.