: 'మా' కౌంటింగ్ కేంద్రానికి రాని జయసుధ!... 5 వ రౌండ్ ముగిసేసరికి 53 ఓట్ల మెజారిటీలో రాజేంద్రుడు


ఒకవైపు 'మా' ఎన్నికల్లో ఫలితాల కోసం ఓట్ల లెక్కింపు జరుగుతుంటే, అధ్యక్ష పదవికి పోటీపడ్డ అభ్యర్థిని జయసుధ కౌంటింగ్ కేంద్రానికి రాలేదు. ఆమెను బలపరిచిన 'మా'కు తాజా మాజీ అధ్యక్షుడు కానున్న మురళీ మోహన్, నటుడు నరేష్ తదితరులు వచ్చారు. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ తరపున పోటీపడ్డ అభ్యర్థులంతా వచ్చారు. తన ఓటమిని ముందుగానే ఊహించిన జయసుధ కౌంటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ కు హాజరుకాని విషయంలో జయసుధ స్పందన ఇంకా వెలువడలేదు. కాగా, 5వ రౌండ్ ముగిసేసరికి 53 ఓట్ల మెజారిటీలో రాజేంద్రుడు కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News