: ఫలితం ఏదైనా నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా: రాజేంద్రప్రసాద్
నలుగురికి ఉపయోగపడాలని, కష్టపడేవారికి సహాయం చేయాలనే తన టీమ్ ధర్మ యుద్ధానికి దిగిందని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. 'మా' ఓట్ల లెక్కింపుకు ముందు ఫిల్మ్ ఛాంబర్ వద్ద తన టీమ్ తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో తీర్పు ఎలా వచ్చినా అది పదిమందికి ఉపయోగపడాలన్నదే తన కోరిక అని చెప్పారు. 'మా' అసోసియేషన్ లో ఉండే ఆ నలుగురు, సినీ కళాకారుల్లో మరో నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నానని తెలిపారు.