: 'మా' ఫలితాలు... ఆధిక్యంలో రాజేంద్ర ప్రసాద్
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. తొలి రౌండ్ ముగిసేసరికి నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్యానల్, జయసుధ ప్యానల్ పై ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సినీ పరిశ్రమ మాత్రం ఒకటేనని కౌంటింగ్ కు ముందు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. మరో రెండు గంటల్లో మొత్తం కౌంటింగ్ పూర్తి అవుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి.