: స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ను కోర్టుకు లాగిన విద్యార్థి


ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ విద్యార్థి దేవాంష్ మెహతా, ఏకంగా కాలేజ్ ప్రిన్సిపాల్ నే కోర్టుకు లాగాడు. కాలేజిలో విద్యను అభ్యసిస్తూ, ఆన్ లైన్ మ్యాగజైన్ 'ఈ-జైన్' నిర్వహిస్తున్న మెహతా, ఒక ఆర్టికల్ లో 'క్రమశిక్షణా ఉల్లంఘన'కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతేకాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నుంచి అందుకున్న సత్ప్రవర్తన బహుమతిని కూడా వెనక్కు తీసేసుకున్నారు. 'ఈ-జైన్' నిర్వహణకు సహకరిస్తున్న ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్ కు క్షమాపణ చెప్పడంతో వారిని విడిచిపెట్టారు. కాగా, తన సస్పెండ్ అన్యాయమని వాదిస్తూ, ప్రిన్సిపాల్ తీరును సవాలు చేస్తూ, మెహతా కోర్టును ఆశ్రయించగా, కోర్టు కేసును విచారణకు స్వీకరించి ప్రిన్సిపాల్ కు నోటీసులు పంపింది. మనసులోని మాట చెప్పే హక్కు లేనప్పుడు ఈ కాలేజీ దేశంలోనే అత్యుత్తమ ఆర్ట్స్ కాలేజీగా ఎలా నిలుస్తుందని మెహతా ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News