: 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'(మా) ఓట్ల లెక్కింపు ఫిల్మ్ చాంబర్ లో ప్రారంభమైంది. గత నెల 29న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 'మా' అధ్యక్ష పదవికి నటులు రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నటుడు ఓ.కల్యాణ్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లడంతో ఇన్నాళ్లుగా 'మా' ఫలితాల వెల్లడి వాయిదాపడింది. మొన్న కోర్టు ఫలితాల వెల్లడికి అనుమతివ్వడంతో ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పోటీలో నిలిచిన అభ్యర్థుల వర్గాల మధ్య మాటల తూటాలు పేలడంతో ఎన్నడూ లేనంతగా 'మా' ఎన్నికలు ప్రజల్లో ఆసక్తిని రేపాయి. మరోవైపు ఫలితాలు కూడా ఉత్కంఠను నింపాయి.