: మోదీ గొప్ప నేత... కలవడం నా అదృష్టం: కెనడా ప్రధాని హార్పర్


సమకాలీన ప్రపంచ నేతల్లో మోదీ ఎంతో గొప్పవాడని, ఆయనను కలవడం తన అదృష్టమని కెనడా ప్రధాని హార్పర్ వ్యాఖ్యానించారు. కెనడా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అక్కడి గురుద్వారాను సందర్శించారు. సిక్కుల సాంప్రదాయం ప్రకారం తలపాగా చుట్టుకున్న మోదీ, హార్పర్ లను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆపై అక్కడికి దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూడా వారు సందర్శించారు. ఈ సందర్శంగా హార్పర్ మాట్లాడుతూ, భారత్, కెనడాల మధ్య దగ్గరి సంబంధాలున్నాయని, రెండు దేశాలు సహజ మిత్రులని అన్నారు. కాగా, మరికాసేపట్లో కెనడాలోని పారిశ్రామికవేత్తలు, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి కెనడా ప్రధానితో డిన్నర్ తర్వాత మోదీ ఇండియాకు తిరిగి రానున్నారు.

  • Loading...

More Telugu News