: మారిషస్ బ్యాంకుకు రూ. 102 కోట్లు బకాయి పడ్డ సుజనా చౌదరి సంస్థ... జోక్యానికి కోర్టు జాప్యం!


మారిషస్ కమర్షియల్ బ్యాంకు (ఎంసీబీ) మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌ ను మూసివేయాలంటూ గతంలో తాము వేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించే విషయంలో త్వరగా తీర్పివ్వాలని అభ్యర్థించింది. తాము మొదట వేసిన కేసుపై వాదనలు పూర్తయి, తీర్పును రిజర్వ్‌ లో ఉంచి నాలుగు నెలలు గడచినా, ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ కోర్టుకు గుర్తు చేసింది. తమకు రావలసిన బకాయిల విషయంలో సెటిల్ మెంట్ చర్చలు విఫలం కావడంతో, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌ ను మూసివేయాలంటూ 18-7-2014న పిటిషన్ వేశామని గుర్తు చేసింది. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నేడో రేపో తేలనుంది. అసలు జరిగింది ఏమిటంటే, గృహోపకరణాల తయారీ రంగంలో సేవలందిస్తున్న సుజనా యూనివర్సల్‌ కు పీఏసీ వెంచర్స్ (సింగపూర్), హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ (మారిషస్) పేరిట అనుబంధ సంస్థలు ఉన్నాయి. మారిషస్‌ అనుబంధ సంస్థ 2010లో ఎంసీబీ నుంచి కోటి డాలర్లు (సుమారు రూ. 60 కోట్లు), 2011లో మరో కోటి డాలర్లు రుణంగా తీసుకొని, దాన్ని చెల్లించడంలో విఫలం అయింది. ఈ కేసును విచారించిన మారిషస్ కోర్టు సుజనా యూనివర్సల్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా సొమ్ము వసూలు చేసుకోవాలని తీర్పిచ్చింది. దీంతో ఎంసీబీ భారత కోర్టును ఆశ్రయించగా, ఇక్కడ తమకు న్యాయం జరగడంలో జాప్యం అవుతోందన్నది ఎంసీబీ వాదన.

  • Loading...

More Telugu News