: మసరత్ ఆలం మళ్లీ అరెస్ట్... పాక్ జెండా ఎగరేసిన ఫలితం
కాశ్మీర్ లో ఇటీవల పెను వివాదానికి కేంద్ర బిందువైన వేర్పాటు వాది మసరత్ ఆలం మళ్లీ అరెస్టయ్యాడు. దేశ సమగ్రతను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టైన అతడి వ్యవహారంపై పెద్ద ఎత్తున వాద ప్రతివాదాలు జరిగాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు మొన్న జైలు నుంచి విడుదలైన ఆయనకు స్వాగతం చెబుతూ వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్పరెన్స్ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు రెపరెపలాడాయి. అంతేకాక పాకిస్థాన్ కు అనుకూలంగా మసరత్ ఆలం పెద్ద పెట్టున నినాదాలు కూడా చేశాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం... అతడిపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ముఫ్తీ మొహ్మద్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది.