: విజయవాడ విమానంలో సాంకేతిక లోపం... ఖజురహో ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దేశ రాజధాని ఢిల్లీ నుంచి నేటి ఉదయం విజయవాడ బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని పైలట్లు మధ్యప్రదేశ్ లోని ఖజురహో విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. నేటి ఉదయం 6.20 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు ఈ విమానం బయలుదేరింది. ఖజురహోలో విమానాన్ని దించేసిన పైలెట్లు, విమానయాన శాఖాధికారులు సహా, విమానానికి చెందిన ఎయిర్ లైన్స్ సిబ్బంది నుంచి ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.