: సత్య నాదెళ్లకు ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’ అవార్డు... స్వయంగా అందించనున్న ఒబామా!


ప్రపంచ కార్పొరేట్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతున్న తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మరో అరుదైన ఘనతను సాధించారు. అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించే ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. సంస్థలు, సమాజంలోని వారికి మెరుగైన సేవలు అందించేందుకు విశేష కృషి చేసిన వారికి వైట్ హౌస్ ఈ అవార్డును అందజేస్తోంది. మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం సత్య నాదెళ్ల పలు విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఆ సంస్థకు చెందిన అమెరికా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వచ్చే ఏడాది నుంచి ఏటా 15 రోజుల వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ తరహా చర్యలతో ఉద్యోగుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న సత్య నాదెళ్లకు వైట్ హౌస్ ‘ఛాంపియన్ ఆప్ ఛేంజ్’ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా అందిస్తారట.

  • Loading...

More Telugu News