: స్టేడియం నిర్మాణంలో అవకతవకలు... బీసీసీఐ ఉపాధ్యక్షుడిని ప్రశ్నించిన ఈడీ


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ కార్యవర్గ సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో పాత్ర ఉందన్న నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వివాదంలో మునిగిపోయారు. తత్ఫలితంగా ఆయన ఏకంగా బీసీసీఐ అధ్యక్ష పదవినే వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు టీసీ మాథ్యూపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని ఎడపాక క్రికెట్ స్టేడియం నిర్మాణంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయట. లండన్ కు చెందిన నిర్మాణ సంస్థకు సదరు కాంట్రాక్టును కట్టబెట్టిన మాథ్యూ భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను నిన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మాధ్యూను ఈడీ ప్రశ్నించిందన్న వార్తలతో బీసీసీఐలో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News