: ప్రతి ఇంటికీ నల్లా, బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ అందిస్తాం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఉచిత నల్లా, బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై వైఫై సేవలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచిత వైఫై సేవలు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై చేపట్టిన వైఫై పథకం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, దీనిని మరింత విస్తృతం చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో వీడియో కాల్ లో మాట్లాడారు.