: కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్ కి ఒకరు చొప్పున బౌలర్లను ప్రయోగించిన రాజస్థాన్ జట్టు ఫలితం సాధించింది. ధావల్ కులకర్ణి వేసిన నాలుగో ఓవర్ లో ఆత్మరక్షణలో పడిన శిఖర్ ధావన్ (10) కీపర్ కి క్యాచ్ ఇవ్వగా, తరువాతి ఓవర్ లో పరుగు కోసం ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ (21)ను అద్భుతమైన త్రోతో అజింక్యా రహానే రనౌట్ చేశాడు. ఆరో ఓవర్ లో తొలి బంతికి ధావల్ కులకర్ణి కేఎల్ రాహుల్ (2)ను అవుట్ చేశాడు. హైదరాబాదు కీలక ఆటగాళ్లు ధావన్, వర్నర్ పెవిలియన్ బాటపట్టడంతో ఆ జట్టు అభిమానులు నిరాశలో మునిగిపోయారు.