: భర్తను హత్య చేయించిన భార్య, ఆమె స్నేహితుల అరెస్టు
వివాహబంధం బలహీనమవుతోంది. గతంలో ఎంత ఒత్తిడిలో ఉన్నా కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చేవారు. కుటుంబం తరువాతే కెరీర్, ఇతర బంధాలు. ఈ నేపథ్యంలో థానేలో జరిగిన ఓ సంఘటన కుటుంబ బంధం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. వివరాల్లోకి వెళితే... ముంబై సమీపంలోని థానేలో విఠల్ వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 7న జగదీష్ థడానీ (24) అనే వ్యక్తి తన భార్య కనిష్క స్నేహితులతో ఫోన్ లో మాట్లాడడం చూసి మందలించాడు. దీనిపై ఆగ్రహించిన కనిష్క స్నేహితులు ప్రేం హర్ చందానీ, గుర్వీందర్ అలియాస్ సన్నీ కుందన్ సింగ్ లు జగదీష్ ను ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో, తన భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడంటూ, జగదీష్ ను కనిష్క ఆసుపత్రిలో చేర్పించింది. చికిత్స్ పొందుతున్న జగదీష్ ఈ నెల 10న మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిజానిజాలు బయటపడడంతో కనిష్క, ఆమె ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.