: ఎయిర్ ఇండియాకు కేంద్రం 600 కోట్ల బకాయి
ఎయిర్ ఇండియాకు కేంద్రం 600 కోట్ల రూపాయలు బకాయి పడింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, 2015 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయలు బకాయిపడిందని తెలిపింది. ఈ మొత్తం వీవీఐపీ ప్రయాణ ఖర్చులకు సంబంధించినదని కేంద్రం వెల్లడించింది. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందించింది. ఇతర శాఖల అధికారులతో చర్చించి వీవీఐపీ ప్రయాణ ఖర్చుల కారణంగా ఎయిర్ ఇండియాకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.