: హైదరాబాదులో 20 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం: షాపూర్ జీ-పల్లంజీ ప్రతినిధులు


హైదరాబాదులో నిర్మాణాల కోసం 20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ-పల్లోంజీ ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలిపారు. హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా వారు, కొత్త సచివాలయం, పోలీస్ కార్యాలయం, కళాభారతి నిర్మాణాలపై చర్చించారు. అలాగే హైదరాబాదులోని ట్రాఫిక్ ఇబ్బందులపై కేసీఆర్ వారికి తెలిపారు. ఫ్లై ఓవర్లు, సెపరేటర్లు, నాలాల నిర్మాణం వంటి వాటిపై సంస్థ ప్రతినిధులతో మరోసారి చర్చిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News