: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ


ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో బీజింగ్ అత్యంత కాలుష్య నగరంగా నిలవగా, ఇప్పుడు దాని స్థానాన్ని ఢిల్లీ ఆక్రమించింది. ప్రపంచంలోని 1600 నగరాల్లోని గాలిలో కాలుష్యాన్ని గణించిన డబ్యూహెచ్ఓ, ఢిల్లీని అత్యంత కాలుష్య కారకంగా తేల్చింది. పదేళ్ల క్రితం ఢిల్లీ పచ్చదనంతో కళకళలాడిందని, గత పదేళ్లలో చోటుచేసుకున్న మార్పులతో ఢిల్లీ కళావిహీనంగా మారిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఢిల్లీ గాలిలో కార్బన్, సల్ఫర్, నైట్రోజన్, లోహ సమ్మేళనాలు పేరుకుపోయాయని, బయోమాస్ దహనం, పరిశ్రమల ఉద్గారాలు, ధర్మల్ విద్యుచ్చక్తి కేంద్రాలు ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి కారణాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఢిల్లీలో 85 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News