: టీసీఎస్ ఉద్యోగులకు రూ.2,628 కోట్ల బోనస్
దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్ధ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు రూ.2,628 కోట్ల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు, 2004 లో కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కు వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు ప్రత్యేక రివార్డు లేదా వన్ టైమ్ బోనస్ ఇవ్వనున్నట్టు టీసీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ బ్రాంచ్ లలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కూడా ఈ బోనస్ కు అర్హులు. అంతేగాక ప్రతి ఉద్యోగికి అతని సర్వీసును బట్టి ఏడాదికి వారం వేతనాన్ని లెక్కగట్టి బహుమతిగా ఇవ్వనున్నట్టు టీసీఎస్ వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ 2014 క్వార్టర్ నాటికి ఈ కంపెనీలో 3.18 లక్షల మంది ఉద్యోగులున్నారు.