: అబార్షన్ కు అనుమతించని న్యాయస్థానం!
గుజరాత్ లో అత్యాచారానికి గురైన మహిళ గర్భం దాల్చింది. జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసిన ఆమె అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఆమె పిటిషన్ విచారించిన న్యాయస్థానం, సానుభూతి ప్రకటించింది. చట్ట ప్రకారం 28 వారాల తరువాత అబార్షన్ కు పర్మిషన్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. బాధితురాలు, ఆమెకు పుట్టే బిడ్డ పరిస్థితి దయనీయమేనని తెలుసునని, అయినప్పటికీ అబార్షన్ కు మాత్రం అనుమతించమని న్యాయస్థానం పేర్కొంది. దీంతో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.